టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈయన ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి బడా హీరోలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి ఒక గొప్ప నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈయన వారసుడు సురేష్ బాబు కూడా సురేష్ ప్రొడక్షన్స్ ను ఏర్పాటు చేసి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇకపోతే లాభనష్టాలతో అంచనా వేసిన ఈయన ప్రస్తుతం మీడియం రేంజ్ అలాగే చిన్నపాటి సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా దగ్గుపాటి రామానాయుడు రెండవ కొడుకు విక్టరీ వెంకటేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఏ రోజు కూడా వివాదాలకు తన జీవితంలోనే చోటు ఇవ్వలేదని చెప్పవచ్చు.
మురళీమోహన్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో అయినా సరే మా అసోసియేషన్ కి అధ్యక్షత పదవి వహించాలని అనుకుంటారు. అంతేకాదు అందులో ఒక చిన్న పదవి వచ్చినా చాలని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వెంకటేష్ మాత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలంతా వచ్చి అడిగినా సరే అందుకు ససే మీరా అన్నారు. ఇప్పటికీ కూడా అధ్యక్ష పదవిని చేపట్టమని చెబితే నాకెందుకు ఇవన్నీ.. నా పని కేవలం నా అభిమానులను సంతోష పరచడమే అని వెంకటేష్ చెప్పినట్లు.. ఇక వెంకటేష్ అలా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు అని మురళీమోహన్ వెల్లడించారు. ఇక వెంకటేష్ సినిమాలలో ఎంత బిజీగా ఉంటారో తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను తెలియజేయడంలో కూడా అంతే గోప్యంగా ఉంటారు అని చెప్పవచ్చు.