నన్ను కూడా అలాంటి కోరికలతో ఇబ్బంది పెట్టారు – అను ఇమ్మానుయేల్

-

సాధారణంగా ఏ రంగంలో అయినా సరే అమ్మాయిలు ఎదుర్కొనే అతి సాధారణ సమస్య క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు బహిరంగంగా తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఒక్కొక్కటిగా బయటపెడుతున్న నేపథ్యంలో తాజాగా.. అను ఇమ్మానుయేల్ కూడా తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి వెల్లడించింది. చదువుకునే రోజుల్లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె 2016లో నిఫిన్ బాలీ కి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళం చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఇక తర్వాత 2016లో నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత తమిళ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక అలా తెలుగులో అజ్ఞాతవాసి , నా పేరు సూర్య, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాలు చేసినా ఈమెకు ఇప్పటికీ స్టార్ ఇమేజ్ వరించలేదని చెప్పవచ్చు. ఇక తాజాగా కార్తీ కి జంటగా జపాన్ చిత్రంలో నటించింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అను ఇమ్మానుయేల్ పలు విషయాలను వెల్లడించింది.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించమని అడగగా.. తాను కూడా అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను అని.. కానీ కుటుంబ సభ్యుల సహాయంతో ఇలాంటి ఘటనలను ధైర్యంగా ఎదుర్కోగలిగాను అంటూ చెప్పుకు వచ్చింది ఇలాంటి సందర్భాలలో సమస్యలు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే జపాన్ సినిమా పైన ఆశలు పెట్టుకున్న అను ఇమ్మానుయేల్ కు ఎలాంటి సక్సెస్ లభిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news