మహాత్మా గాంధీ పోటీ చేసినా.. సీఎం కేసీఆర్ ఓడగొడతారని బిజేపి పార్టీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలల సాక్షాత్తు మహాత్మా గాంధీజీ పోటీ చేసిన కూడా, ప్రజలను ఆ మహాత్ముని బొమ్మలున్న నోట్ల వంటి ప్రలోభాలు చూపుతున్నారని పేర్కొన్నారు విజయశాంతి.
అనారోగ్య ఎన్నికల వాతావరణం ను నడిపి , మన తెలంగాణ ప్రజల జీవితాలను మరోసారి నాశనం చేసే ఈ బీఆర్ఎస్, కేసీఆర్ దొరల ప్రభుత్వ ధోరణి గురించి….. ఉద్యమాల తెలంగాణ భూమికి మరో మారు తెలియచేయవలసిన సందర్భం తీవ్రంగానే ఆసన్నమవుతుందన్నారు విజయశాంతి. మునుగోడు ఒక తప్పిదం అంటున్నరు. తెలంగాణ రాష్ట్రమే ఒక దుర్మార్గ, తప్పిదాల, వైఫల్యాల మరియు దోపిడీ వ్యవస్థతో నడుస్తున్నది.ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరికీ తప్పక ఉంది. పార్టీల విభేదాలకు అతీతంగా…కూనమనేని గారి ప్రకటనను గౌరవిస్తున్నామని తెలిపారు విజయశాంతి.