కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. అది డిక్లరేషన్ సభ కాదు… అధికారం రానే రాదనే… కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు ? అని ట్వీట్ చేశారు. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు.. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలు గాలీలో దీపాలేనని చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసని కేటీఆర్ అన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీలు ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే దానికి కారణం.. ప్రధాన దోషి.. కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదని ట్వీటారు.
‘ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే.. దేశానికే ఓ పరిపాలనా పాఠం. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ మీది. ఇవ్వని హామీలెన్నో అమలుచేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.’ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
అది డిక్లరేషన్ సభ కాదు…
అధికారం రానే రాదనే…
కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభకర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు
మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిదిచైతన్యానికి ప్రతీకైన
తెలంగాణ ప్రజలకు…— KTR (@KTRBRS) August 27, 2023