బన్నీ ట్రెండ్​ సెట్​ చేసిన ఐకానిక్​ లుక్స్​.. మీరు ట్రై చేశారా?

-

యూత్‌కు స్టైలిష్‌ ఐకాన్‌.. అమ్మాయిలకు ప్రేమను పంచే ‘ఆర్య’.. ‘డీజే’ సైతం పగిలిపోయేలా స్టెప్‌లు వేసే డ్యాన్సర్‌.. కథ, అందులోని పాత్ర కోసం తనని తాను మలుచుకునే నటనా శిల్పి.. కేవలం నటనే కాదు, స్టైల్​లోనూ సూపర్​. ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప’ వరకూ బన్నీ సినీ ప్రయాణం చూస్తే దేనికదే ప్రత్యేకం. సినిమా సినిమాకు గెటప్​లోనూ డిఫరెంట్​గా కనిపిస్తూ ఫ్యాన్స్​ను ఖుషి చేస్టుంటారు. సరికొత్త ట్రెండ్​ను సెట్​ చేస్తుంటారు. వేసుకునే షూస్​ నుంచి హెయిర్​ స్టెయిల్​ వరకు ఇలా ప్రతీది ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. బన్నీ విషయంలో అభిమానుల రూటే సెపరేటు.

ఎందుకంటే వారు బన్నీ స్ట్లైల్​ను అచ్చం అలానే ఫాలో అవుతూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే ‘పుష్ప’ కోసం ఆయన గత రెండేళ్లుగా ఒకే లుక్​లో ఉన్నారు. గుబురు గడ్డం, రింగుల జుట్టుతోనే ఇప్పటి వరకు కనిపించారు. అయితే తాజాగా ఆయన సరికొత్త లుక్​లో కనిపించి అభిమానులను సర్​ప్రైజ్​ చేశారు. బ్లాక్ టీషర్ట్ లో స్ట్రెయిట్ హెయిర్​తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. పుష్ప 2 కోసం ఆయన అలా మారబోతున్నారని అంతా అనుకుంటున్నారు. ఓ సారి ఆ కొత్త లుక్​తో పాటు గతంలో ఆయన సెట్​ చేసిన స్టైలిష్​ లుక్స్​ను ఓ సారి చూసేద్దాం..

 

సినిమాకు నటన ఒక్కటే సరిపోదు.. నటులు తమ అభిమానుల అభిరుచిని గ్రహించగలగాలి. అందుకు తగ్గట్టుగా తమను తాము మలుచుకోవాలి. ఆ విషయంలో అందరికంటే ముందుంటారు అల్లు అర్జున్‌. ‘గంగోత్రి’లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన ‘ఆర్య’తో మొదలు పెట్టి ‘బన్ని’, ‘హ్యాపీ’, ‘దేశ ముదురు’, ‘పరుగు’ సినిమాలతో టాలీవుడ్‌లో తన మార్కు వేశారు. అప్పటి నుంచి దక్షిణాది స్టైలిష్‌ స్టార్‌గా మారారు. ఆయన స్టైల్‌ విషయంలో ఎప్పటికప్పుడు ఎలా అప్‌డేట్‌ అవుతారని అడిగితే.. సినిమా సినిమాకు కొత్తగా ఉండేలా జాగ్రత్త పడటమే అని జవాబిస్తారు.

‘దేశముదురు’లో.. టాలీవుడ్​కే ట్రెండ్​ సెట్టర్​ సినిమా. ఇందులో బన్నీ బాడీ లాంగ్వేజ్​, సిక్స్​ ప్యాక్స్​, హెయిర్​స్టైల్​ సంచలనం సృష్టించింది. టాలీవుడ్‌లో సిక్స్‌ప్యాక్‌ మొదలైంది బన్నితోనే. ‘దేశ ముదురు’ చిత్రంలో అల్లు అర్జున్‌ తొలిసారిగా ఆరు పలకల దేహంతో కనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించింది. యాక్షన్ రొమాంటిక్​గా తెరకెక్కిన ఈ సినిమా అల్లుఅర్జున్​ కెరీర్​ను మలుపు తిప్పింది. యూత్​లో ఫుల్​ ఫాలోయింగ్​ను పెంచింది. పూరిజగన్నాథ్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్​.

‘ఆర్య-2’.. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ.. బన్నీ లుక్​కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా హెయిర్​ స్టైల్​లో అప్పట్లో యూత్​ అంతా దీన్నే ఫాలో అయ్యేవారు. ఇందులో కాజల్​ హీరయిన్​.

‘ఇద్దరు అమ్మాయిలతో’.. ఇది కూడా పూరిజగన్నాథ్​-అల్లుఅర్జున్​ కాంబోలో వచ్చింది. ఈ సినిమాలో కేవలం తన స్టైల్​ అండ్​ ఆటిట్యూడ్​తోనే బన్నీ చిత్రాన్ని నడిపించాడు.

‘నా పేరు సూర్య’.. ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ ఇందులో కూడా అల్లుఅర్జున్​ హెయిర్​స్టైల్, రఫ్​ యాక్షన్​కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత చాలా మంది షార్ట్​ హెయిర్​ను ఫాలో అవ్వడం ప్రారంభించారు.

‘డీజే’.. ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్​లో కనిపించారు. ఇందులో బన్నీ స్టైల్​, డ్యాన్స్​కు విపరీతమైన క్రేజ్​ వచ్చింది. హరీశ్​శంకర్​ దర్శకుడు.

‘అలా వైకుంఠపురము’లో.. ఈ సినిమాలో యాక్టింగ్​లో మాస్​గా లుక్​లో క్లాస్​ కనిపించి సందడి చేశారు. ఈ చిత్రం బన్నీ కెరీర్​లో స్పెషల్​గా నిలిచింది. ఈ మూవీ హిందీ వెర్షన్​.. బీటౌన్​ ప్రేక్షకులను బాగా నచ్చేసింది. సోషల్​మీడియా యూట్యూబ్​లో రికార్డు వ్యూస్​ను దక్కించుకుంది. ఇక పాటలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ స్థాయిలో శ్రోతలను ఉర్రూతలుగించాయి.

కాగా, బన్నీ ‘విజేత’, ‘స్వాతిముత్యం’ చిత్రాల్లో బాల నటుడిగా అలరించి ‘గంగోత్రి’తో హీరోగా మారారు. ‘ఆర్య’తో మంచి గుర్తింపు పొందారు. ‘బన్నీ’, ‘హ్యాపీ’, ‘దేశముదురు’, ‘వేదం’, ‘జులాయి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ తదితర సినిమాలతో విశేష క్రేజ్‌ సంపాదించారు. ‘పుష్ప: ది రైజ్‌’తో పాన్‌ ఇండియా హీరోగా అవతరించారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబరులో విడుదలై రికార్డు సృష్టించింది. ప్రస్తుతం.. అర్జున్‌ ఈ సినిమా సీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version