రకుల్ పెళ్లి చేసుకుంటే.. విడాకులు తప్పవా..?

-

ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె తెలుగు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని మరింత బిజీగా మారింది. అయితే ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె అక్కడ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే హిందీలో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు సరైన హిట్ అయితే పడలేదని చెప్పాలి.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో వివాహానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా మీడియాతో కూడా వెల్లడించింది. అయితే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని జీవితాన్ని సంతోషంగా గడపాలనుకున్న రకుల్ కు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఆమె వివాహం చేసుకుంటే విడాకులు తప్పవు అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

వేణు స్వామి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంటే కలిసి రాదు అని ముందే చెప్పాను. ఇక ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటి నుంచి తన కెరీర్ ఎలా ఉందో మనమందరం చూస్తూనే ఉన్నాము. సరైన అవకాశాలు లేక కెరియర్ కోసం తెగ ఇబ్బంది పడుతోంది. ఒకవేళ నా మాటలు కాదని రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకుంటే మరో సమంత అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతారు. అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేయడం ఇప్పుడు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తానికైతే వేణు స్వామి చేసిన కామెంట్లు కొంతమంది నిజమని నమ్ముతుంటే మరి కొంతమంది కొట్టి పారేస్తున్నారు. మరి దీనిపై రకుల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version