ప్రముఖ దివంగత నటుడు శివాజీ గణేషన్ ను చిత్ర పరిశ్రమ ప్రభుత్వం తగిన రీతిలో సత్కరించలేదని తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు. ఇటీవల ప్రముఖ రచయిత మరుగు మోహన్.. నటుడు శివాజీ గణేషన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇళయరాజా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చెన్నైలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు భారతి రాజా, కే భాగ్యరాజ్, సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు ప్రభు, రాంకుమార్, రచయిత ముత్తులింగం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నివేదికపై ఇళయరాజా మాట్లాడుతూ.. శివాజీ గణేషన్ నుంచి తాను నేర్చుకున్న ఎన్నో విషయాలలో కాలం కూడా ఒకటని పేర్కొన్నారు. క్రమశిక్షణలో ఆయనకు మించిన వారు మరొకరు లేరు.. తన కారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు స్టూడియో ముందు వచ్చి ఆగేది.. ఒకసారి నేను ఆలస్యంగా రావడంతో ఏమిటి రాసా నువ్వు కూడానా అని శివాజీ గణేషన్ నన్ను అడిగారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనుభవాలను పంచుకునేవారు అని.. ఒకసారి సినీ పరిశ్రమ తరపున శివాజీ గణేషన్ కి అభినందన సభ జరిగిందని కూడా ఇళయరాజా తెలిపారు.
శివాజీ గణేషన్ కు ఒక కానుక అందించాలని నిర్ణయించుకున్నాము. అందుకు తగిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేసాము. నటీనటులు తినే భోజనంలో ప్రతిబియ్యం గింజపైన శివాజీ గణేషన్ పేరు ఉంటుంది అంటూ ఇళయరాజా వెల్లడించారు దీంతో ఆయనకు ప్రధానం చేసే జ్ఞాపికపై ఎవరి పేర్లు ఉండరాదని దానికి అయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పానన్నారు. ఆ విషయం తెలిసి శివాజీ గణేషన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారని ఈ విధంగా ఆయన వ్యక్తిత్వం గురించి ఇళయరాజా గుర్తుచేసుకున్నారు.