చంద్రబాబుకు ఇది చెంప పెట్టు లాంటిది : కాకాణి

-

రాష్ట్రంలో విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని గృహ.. వ్యవసాయ రంగాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సెకీ సంస్థతో తక్కువ ధరకే అప్పటి వైసిపి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కానీ ఆ ఒప్పందంపై చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా రాద్ధాంతం చేసింది. అవినీతి జరిగిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. సెకీతో చేసుకున్న ఒప్పందం సక్రమమైనదేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తెలిపింది. అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని.. దానిని రద్దు చేయడం కుదరదని పేర్కొంది. ఒప్పందం పారదర్శకంగా ఉందని వెల్లడించింది.

అయితే ఇది చంద్రబాబుతో పాటు టిడిపి కరపత్రాలకు చెంప పెట్టు లాంటిది. సెకీ ఒప్పందం పేరుతో జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నారు. సెకీతో ఒప్పందం వల్ల జగన్ కు లంచాలు వచ్చాయని ప్రచారం చేశారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా తప్పుపట్టారు. చంద్రబాబు ఒప్పందాలకు కుదుర్చుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం అని చెప్పి ప్రచారం చేస్తారు. వాస్తవంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఒప్పందాన్ని జగన్ చేసుకుంటే దానిని వక్రీకరిస్తున్నారు. సెకీ విద్యుత్ కు ఐ.ఎస్.టి.ఎస్. చార్జీలు చెల్లించాలని తప్పుడు ప్రచారం చేశారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించిన వివరాలతో చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా తల దించుకోవాలి అని కాకాణి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news