చివ‌రికి ఆఫ‌ర్ కొట్టేసిన ఇలియానా.. అత‌న్నే న‌మ్ముకుంది మ‌రి!

గోవా బ్యూటీ ఇలియానా ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఈ స‌న్న న‌డుము చిన్న‌ది త‌న అందం, అభిన‌యంతో అన్ని భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ లో ఎంత పేరు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంద‌రు పెద్ద హీరోల‌తోనూ న‌టించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ కి చెక్కేసింది. ఆపై తెలుగులో పెద్ద‌గా సినిమాలు చేయ‌ట్లేదు ఈ బ్యూటీ.


ఇక బాలీవుడ్ లో బిజీగా ఉండ‌గానే ప్రేమ పెండ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో త‌న మ్యారేజ్ కు బ్రేక్ అప్ చెప్పేసింది. ఇక గ‌త కొద్ది కాలంగా పెద్ద‌గా సినిమా ఆఫ‌ర్లు లేక ఖాళీగానే ఉంటోంది. ఇటు టాలీవుడ్‌, కోలీవుడ్ పైనా దృష్టి పెట్టింది. ఎవ‌రైనా అవ‌కాశం ఇవ్వ‌క‌పోతారా అని చూస్తోంది కానీ ఆఫ‌ర్లు మాత్రం రావ‌ట్లేదు.
అయితే త‌న‌కు క‌ష్ట‌కాలంలో రెండు సార్లు అవ‌కాశం ఇచ్చిన అజ‌య్ దేవ‌గ‌న్ మ‌రోసారి ఆదుకుంటున్నాడు.

ఆయ‌న చేయ‌బోయే డిజిటల్ ఎంట్రీ ప్రాజెక్ట్ లో ఇలియానాకు అవ‌కాశం ద‌క్కింద‌ని టాక్‌. అయితే ఇది సినిమా కాదండోయ్‌. సినిమా లకు ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ విస్తరించిన సంగ‌తి తెలిసిందే. అజయ్ దేవగన్ ప్ర‌స్తుతం రుద్ర అనే థ్రిల్లర్ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇందులో ఇలియ‌నా కీల‌క పాత్ర చేస్తోంది. ఈ జోడీకి స‌క్సెస్ పేరుంది. మ‌రి ఆపేరు నిల‌పుకుంటారా లేదా చూడాలి.