ఇలియానా సొంతది వాడేస్తుంది

-

గోవా బ్యూటీ ఇలియానా 2012 తర్వాత సౌత్ సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇక్కడ మంచి ఫాంలో ఉండగా బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకు చెక్కేసింది. బాలీవుడ్ ఆఫర్లు సన్నగిల్లగా మళ్లీ సౌత్ సినిమాల మీద కన్నేసింది. అయితే ఇక్కడ ఆఫర్లు అంత ఈజీగా రాలేదు. ఫైనల్ గా శ్రీను వైట్ల డైరక్షన్ లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న అమర్క్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఇలియానా.

ఇప్పటికే రవితేజతో మూడు సినిమాల్లో నటించిన ఇలియానా ఇది నాల్గవ సినిమా అవడం విశేషం. ఈ సినిమా కోసం ఇలియానా కెరియర్ లో మొదటిసారి సొంత డబ్బింగ్ చెబుతుందట. ఈమధ్య తెలుగులో నటిస్తున్న ప్రతి హీరోయిన్ తెలుగు ప్రేక్షకులను మరింత ఆకర్షించేందుకు వారి గొంతు సవరించుకుంటున్నారు. సమంత, రకుల్, పూజా హెగ్దె, కీర్తి సురేష్ ఇప్పటికే తెలుగు సొంత డబ్బింగ్ చెబుతున్నారు. వారి దారిలోనే ఇల్లి బేబ్ కూడా ట్రిపుల్ ఏ సినిమాకు సొంత డబ్బింగ్ చెప్పిందట. నాలుగు రోజుల్లోనే డబ్బింగ్ పూర్తయిందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 16న రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న రవితేజ, శ్రీను వైట్ల, ఇలియానాలకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version