అమ్మా ఇలియానా.. నీకంత సీనుందా..?

-

ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న ఇలియానా ఇక్కడ ఆఫర్లు వదులుకుని బాలీవుడ్ వెళ్లాక ఆమె మీద ఉన్న క్రేజ్ తగ్గిపోయింది. పొకిరి టైంలో ఇలియానా తన సోయగాలతో తెలుగు ప్రేక్షకులను వల్లో వేసుకుంది. అయితే చాన్నాళ్ల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇల్లి బేబి నటించినా ఇదవరకు అంత చార్మింగ్ అనిపించలేదు. అందుకుతోడు కాస్త లావెక్కడంతో అసలేమాత్రం బాగాలేదు.

సినిమాలో ఇలియానా ఉంటే కాస్త కూస్తో గ్లామర్ షో ఉండాల్సిందే.. కాని అమ్మడు అమర్ అక్బర్ ఆంటోనిలో అది కూడా చేయలేదు. అందుకే సినిమా వచ్చింది వెళ్లింది అన్నట్టుగా ఉంది. ఇక ఈ అమ్మడికి తెలుగులో ఛాన్సులు వస్తున్నా రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసి వదులుకుంటుందట. లేటెస్ట్ గా రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఇలియానాని అడిగారట.

ఈమధ్య కాస్త ఫాం తగ్గింది అనుకునే టైంలో హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ తో డబుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలానే వి.వి.ఆర్ కోసం ఇలియానాని అడిగితే అమ్మడు 60 లక్షల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. 5 నిమిషాల పాటకు ఆమెకు అంత అవసరం లేదని మేకర్స్ వెనక్కి తగ్గారట. తెలుగులో అవకాశాలు రావట్లేదని అంటున్న ఇలియానా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇలా కాలదన్నుకుంటుంది. చరణ్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ అన్న గోవా భామకు ఇక తెలుగు సినిమా అవకాశాలు కష్టమే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version