Koratala Siva: స్టోరిలో అతిముఖ్యమైన పాత్రలో రామ్ చరణ్..‘సిద్ధ’ రోల్‌పై క్లారిటీనిచ్చిన ‘ఆచార్య’ డైరెక్టర్

-

ఈ నెల 29న విడుదల కానున్న ‘ఆచార్య’ చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేశారు. దర్శకులు కొరటాల శివ, హీరో రామ్ చరణ్ తాజా ఇంటర్వ్యూలో చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. కాగా, ఈ పిక్చర్ లో రామ్ చరణ్ రోల్ పై పూర్తి స్పష్టతనిచ్చారు ‘ఆచార్య’ డైరెక్టర్. దర్శకులు కొరటాల శివ- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కాల్సింది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ, తర్వాత ఆ కాంబినేషన్ డ్రాప్ అయింది.

కొరటాల శివ ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో ఉంచుకుని స్టోరి రాయడం స్టార్ట్ చేశారు. అలా స్టోరి రాస్తున్న క్రమంలోనే ఒక చక్కటి ప్రత్యేకమైన పాత్ర రావడం జరిగిందని, అది ఎవరు పడితే వారు చేసేది కాదని, స్టార్ ఇమేజ్ ఉండి అందులో ఒదిగపోయే వ్యక్తిత్వమున్న నటుడు చేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు దర్శకులు కొరటాల శివ. అలా ఈ స్టోరి చిరంజీవికి వినిపించిన తర్వాత, రామ్ చరణ్ కు చెప్పడంతో సినిమాలోకి ‘సిద్ధ’గా మెగా పవర్ స్టార్ వచ్చేశారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రితో కలిసి పని చేసే అవకాశమిచ్చిన కొరటాలకు థాంక్స్ చెప్పారు. 15 నిమిషాల నిడివి ఉన్న పాత్రను సెకండ్ హాఫ్ మొత్తం వచ్చేలా..దాదాపుగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన శివకు ధన్యవాదాలు తెలిపారు.

తనకు ‘నీలాంబరి’ అనే లవ్ సాంగ్ కూడా ఇచ్చారని వివరించారు. వెండితెరపైన తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ లను చూడటానికి రెండు కళ్లు చాలవని ఈ సందర్భంగా దర్శకులు తెలిపారు. రామ్ చరణ్ కు జోడీగా ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. చిరంజీవి సరసన అందాల ముద్దుగుమ్మ, పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ నటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news