‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లో ఉండబోయే మెయిన్ హైలైట్స్ ఇవే…. ??

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు యువ దర్శకుడు అనిల్ రావిపూడిల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి గారు చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి మళ్ళి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో న్తసితున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్ తో పాటు పలు పోస్టర్లు సైతం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.
ఇక వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా అధికారిక ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గత కొద్దిరోజలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ టీజర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలు బయటకు రావడం జరిగిందని అంటున్నారు. దానిని బట్టి, టీజర్ మొత్తం రన్ టైం ఒక నిమిషం ఉంటుందని, అందులో మెయిన్ గా రెండు యాక్షన్ సీన్స్ తో పాటు రెండు ఎంటర్టైనింగ్ డైలాగులు కూడా ఉండబోతున్నట్లు టాక్.
interesting updates on Sarileru Neekevaru Movie Teaser
interesting updates on Sarileru Neekevaru Movie Teaser
ఇక మహేష్ తో పాటు హీరోయిన్ రష్మిక, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ఈ టీజర్ లో కొన్ని క్షణాలు కనపడతారని,అన్నిటికంటే ముఖ్యంగా టీజర్ లో మహేష్ పలికే కామెడీ పంచెస్ అదిరిపోవడం ఖాయమని అంటున్నారు. మరి ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ టీజర్ కనుక ఇదే విధంగా ఉంటె, సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి తారాస్థాయికి చేరడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. సూపర్ స్టార్ మహేష్ కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది….!!