ఆ యంగ్ హీరోయిన్‌కు పెళ్లైందా..?

-

ఐశ్వర్యా రాజేష్ తెలుగు నాట కౌసల్యా కృష్ణమూర్తి అనే చిత్రంతో పరిచయమైంది. అయితే రీసెంట్‌గా సువర్ణ అంటూ పలకరించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్యా రాజేష్.. సువర్ణ పాత్రతో అందర్నీ మెప్పించింది.

సినిమా మొత్తంలో శీనయ్య-సువర్ణ పాత్రకు వచ్చిన రెస్పాన్స్.. మరే క్యారెక్టర్‌కు రాలేదు. అయితే తమిళ నాట ఐశ్వర్యా రాజేష్ నటన గురించి చాటి చెప్పే చిత్రాలెన్నో ఉన్నాయ. కోలీవుడ్‌లో హిట్ అయిన కణ సినిమానే తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తిగా రీమేక్ చేశారు. మిస్ మ్యాచ్ అనే మరో చిత్రాన్ని చేసినా..అంతగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా వచ్చిన సంగతి కూడా చాలా మందికి తెలియదు.

తాజాగా ఐశ్వర్యా షేర్ చేసిన ఫోటో ఎన్నో అనుమానాలకు దారి తీసింది. ఏదో దైవ దర్శనం చేసుకుని వస్తున్నప్పుడు సంప్రదాయ బద్దంగా బొట్టు పెట్టుకున్నట్టుంది ఐశ్వర్యా. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. భక్తి రస సమయం అంటూ ఓ పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్స్.. పెళ్లైందా? అని కామెంట్స్ పెట్టసాగారు. అయితే మరో పోస్ట్ చేస్తూ.. ఒంటరిగా ఉంటేనే సంతోషంగా ఉంటారు..అంటూ పెళ్లి కాలేదంటూ పరోక్షంగా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news