త్రాచు పాము నుంచి ప్రాణాలు తీసే వైరస్…!

-

ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వైరస్ భయపెడుతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రాణంతకంగా మారింది. దీనితో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దీనితో ఇప్పటికే చైనాలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో అన్ని విమానాశ్రయాల్లో హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి విదేశాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే దీనిపై పరిశోధకులు ఇప్పుడు పరిశోధనలు ముమ్మరం చేసారు.

చైనాలోని క్రైట్ (Krait), కోబ్రా (Cobra) పాముల వల్ల కొరొనా వైరస్ వ్యాపించి ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు పాములు అత్యంత విషపూరితమైనవి. అయితే వాటి నుంచి ఏ విధంగా ఈ వైరస్ వచ్చింది, ఎవరిని అయినా పాములు కరిచాయా లేక వాటిని ఎవరైనా చంపి తింటే వచ్చిందా అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. చలికాలంలో ఇది రావడంతో,

ఊపిరి తిత్తుల సమస్యలు వచ్చి, అది క్రమంగా ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది. గతేడాది డిసెంబర్‌లో మధ్య చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి అధికారులు ఈ వైరస్‌ని గుర్తించారు. ఇప్పటికే భారత్ సహా అనేక దేశాల్లో ఈ వైరస్ కి సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ సహా ఏడు అంతర్జాతీయ విమానాశ్రాయాల్లో దీనిపై వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news