అతని అండవల్లే నిహారిక ఇలా బిహేవ్ చేస్తోందా..?

-

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమెకి ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, వాటిని నిర్మిస్తూ కెరియర్ పరంగా బిజీగా మారింది. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే డెక్స్చర్ , దిస్ ఈజ్ అస్ తనకు ఇష్టమైన వెబ్ సిరీస్ లు అంటూ నిహారిక తెలిపింది.

ఇకపోతే ఇండోనేషియాలోని బాలి ప్రదేశం తనకు చాలా ఇష్టమైన ప్రదేశం అని చెప్పుకొచ్చిన నిహారిక తన అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం సమయంలో దిగిన ఫోటో అంటే తనకు చాలా స్పెషల్ అని కూడా కామెంట్ చేసింది. ఇకపోతే బోర్డు గేమ్స్ ఏవైనా సరే తనకు చాలా ఇష్టం అని చెప్పిన ఈమె ఎక్కువగా రొమాన్స్ , మర్డర్ మిస్టరీ డ్రామాలను ఇష్టపడతానని కూడా చెప్పుకొచ్చింది. ఇకపోతే విడాకుల తర్వాత కూడా నిహారిక ఇంత సంతోషంగా ఉండడానికి కారణం తన అన్నయ్య వరుణ్ తేజ్ అన్నట్టు సమాచారం.

వాస్తవానికి నిహారిక అంటే తన అన్నయ్య వరుణ్ తేజ్ కి ఎనలేని ప్రాణం అని చెప్పాలి. ఆమెకు సంబంధించిన ఏ విషయమైనా సరే వరుణ్ తేజ్ దగ్గరుండి మరీ చూసుకుంటారు. అందుకే అటు వైవాహిక జీవితంలోను ఇటు విడాకుల తర్వాత జీవితంలో కూడా ఆమెకు అండగా నిలిచారని, ఆ అండతోనే మరింత ఫ్రీడమ్ గా తన కెరియర్ ను కొనసాగిస్తుందని సమాచారం. ఏది ఏమైనా నిహారిక జీవితానికి తన అన్నయ్య పెద్ద అండగా నిలిచారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news