ఎన్టీఆర్ అలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నారా.. అసలు విషయం ఇదే..!!

-

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో తాతకు తగ్గ మనవిడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఒక సీరియల్ లో కూడా నటించడం జరిగింది. ఇకపోతే స్టూడెంట్ నెంబర్ వన్, ఆది , సింహాద్రి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత అరవింద సమేత, జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది . ఇటీవల వచ్చిన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా చలామణి అవుతున్నారు.Jr NTR turns 39: Telugu celebrities recall their association with RRR star | Entertainment News,The Indian Express

ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించిన ఎన్టీఆర్ ఇప్పటికీ కూడా సినిమా షూటింగ్ మొదలు పెట్టకపోవడం గమనార్హం. ఇందుకు కారణం ఎన్టీఆర్ ఒక సమస్యతో బాధపడుతున్నారని సమాచారం.. ఏమిటా ఆ సమస్య అంటే.. రాజమౌళి సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు ఎన్టీఆర్ విపరీతంగా కష్టపడిన విషయం తెలిసిందే. ఇక మాస్ యాక్షన్ సన్నివేశాలలో ఆయన డూపు లేకుండా నటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ముఖ్యంగా డూపు లేకుండా నటించి తన శరీరాన్ని హూనం చేసుకున్నాడు అని సమాచారం.

ఈ క్రమంలోనే విపరీతమైన వెన్నునొప్పి , మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ఎన్టీఆర్ ను ఒక నాలుగు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని ఎటువంటి షూటింగ్లో పాల్గొనకూడదు అని వైద్యులు సూచించారట. ఇక ఈ సలహా మేరకే ఆయన విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత మరో నాలుగు వారాలపాటు విశ్రాంతి తీసుకోబోతున్నారని సమాచారం. ఇక ఆ తర్వాతే కొరటాల శివ సినిమా షూటింగ్లో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత బుచ్చిబాబు సనా తో ఒక సినిమా , కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news