నీతి ఆయోగ్ గవర్నింగ్‌కౌన్సిల్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను సీఎం జగన్ వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యింది. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగంమీదే ఆధారపడి జీవిస్తున్నారు.
రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటే. వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆ రంగానికి మేం అత్యంత ప్రధాన్యత ఇస్తున్నాం. వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నామని చెప్పారు.
రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నామన్నారు. అయితే.. ఈ ప్రశంసం అనంతరం సీఎం జగన్ ను భుజం తట్టి అభినందించారు ప్రధాని మోడీ.