నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య.. కత్తితో పొడిచి!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. విధులు ముగించుకుని ఇంటి వెళ్లున్న కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ గూడూర్ సురేంద్ర కుమార్ డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. రాజ్ థియేటర్ దగ్గర కాపు కాచుకుని కూర్చున్న ఆరుగురు దుండగులు కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసి.. ఆటోలో తీసుకెళ్లారు.

కానిస్టేబుల్-దారుణ హత్య
కానిస్టేబుల్-దారుణ హత్య

నంద్యాల పట్టణ శివారులోని చెరువు కట్టపైకి తీసుకెళ్లి.. కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రి తీసుకెళ్లమని చెప్పి నిందితులు వెళ్లిపోయారు. దీంతో ఆటో డ్రైవర్ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే కానిస్టేబుల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.