ఇలియానా తెలుగు ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..?

-

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది ఇలియానా. తన అందం, ఫిట్నెస్తో ఎంతోమంది కుర్రకారులను సైతం తన వైపు చూసేలా చేసింది ఇలియానా. మొదట 2006లో విడుదలైన దేవదాసు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఇలియానాతో పాటు హీరో రామ్ పోతినేని నటించి హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా అప్పట్లో అత్యధిక కేంద్రాలలో వంద రోజులు ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది. అలా మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఇదేనా ఆ వెంటనే పోకిరి సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ సినిమా కోసం ఇలియానా కేవలం 20 రోజులు మాత్రమే కాల్ సీట్లను ఇచ్చింది. ఈ చిత్రం ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్ నే తిరగరాసింది. ఈ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా హీరోయిన్గా కోటి రూపాయలు అందుకున్న హీరోయిన్గా పేరుపొందింది ఇలియానా. ఎంతోమంది నిర్మాతలు సైతం ఈమెకు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి తన సినిమాలో నటించాలని కోరేవారట. అలా ఇలియానా ఖాతాలో జల్సా జూలై వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన ఈమె రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అడిగినంత ఇచ్చేవారట నిర్మాతలు.

ఒక్కసారిగా సౌత్ సినిమాలకు దూరమై బాలీవుడ్ వైపు తన మకాన్ని మార్చేసింది. అందుకు ఇలియానా బాలీవుడ్ పైన ఉన్న మోజు కారణమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె ఒక హీరోతో ప్రేమ డేటింగ్ వంటి వ్యవహారాలు నడిపిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ హీరో వల్ల ఆమె గర్భవతి అయినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. దీంతో ఆ హీరో ఇలియానాని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు కానీ అతని కుటుంబం మాత్రం ఒప్పుకోలేకపోవడంతో ఇలియానాను దూరం పెట్టడం మొదలుపెట్టారట. అయితే ఆ హీరోతో ఇలియానా వివాహం జరిపించాలని ఒక బడనిర్మాత ఎంత ప్రయత్నించినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట దీంతో ఇమే టాలీవుడ్ కు దూరమైందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version