మలైకా అరోరా వేసుకున్న సింపుల్​ డ్రెస్​ అంత రేటా?

-

వయసు పెరిగే కొద్దీ అందం పెరగడం అంటే ఇదేనేమో. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మలైకా అరోరానే అని చెప్పడం అతిశయోక్తి అనిపించదు. ఎందుకంటే ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐదు పదులు వయసుకు చేరువవుతున్నా, ఆమెలో అందం తగ్గడం లేదు. అందుకే ఆమెకు యూత్‌లో అంత క్రేజ్. ఆపై తన కన్నా వయసులో 12 ఏళ్లు చిన్నోడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తూ, మరింత సెన్సేషనల్ అయ్యింది.

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్​ పోస్ట్ చేసింది. ఆ అందాలకు ఆమె ఫిట్​నెస్​కు కుర్రకారు అతలాకుతలం అవుతున్నారు. కేవలం ఎక్స్‌పోజింగే కాదు, ఆ ఎక్స్‌ప్రెషన్, ఆ ఆంబియన్స్ అన్నీ చక్కగా కుదిరాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా మలైకా విషయంలో ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ అంతే. వయసుకీ, ఆమె ఫిట్‌నెస్‌కీ, ఆమె అందానికీ అస్సలు పోలీకే లేదు. ఆల్వేస్ బ్యూటిఫుల్, ఫిట్ అండ్ పర్ఫెక్ట్ మలైకా అంతే అని కూడా అంటున్నారు.

మరోవైపు ఇంకో ఫొటోషూట్​లో ఆమె వేసుకున్న డ్రెస్​ కూడా ట్రెండ్ అవుతున్నాయి. అది చూడటానికి చాలా సింపుల్​గానే ఉన్నా దాని ధర కూడా రూ.38వేలు అని తెలిసింది. అంత సింపుల్​ డ్రెస్​కు అంత ధర? అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news