హీరోయిన్ ప్రియమణి ప్రేమ వివాహం వెనుక ఇంత కథ ఉందా..!!

-

దక్షిణాది స్టార్ హీరోయిన్ లలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది హీరోయిన్ ప్రియమణి. ప్రస్తుతం పలు డాన్స్ షో లతో పాటు, బుల్లితెరపై పలు కార్యక్రమాలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఢీ షో లో జడ్జిగా వ్యవహరించ బట్టి.. ప్రియమణి ఇప్పటికి సుమారుగా ఐదు సంవత్సరాలు కావస్తోంది. అందుచేతనే ఇద్దరు కంటెస్టెంట్ లు ఒక పర్ఫార్మెన్స్ రూపంలో ప్రియమణి ప్రేమ , జీవితం గురించి కొన్ని విషయాలు తెలియజేశారు వారే సాయి- నైనిక. ఇక ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.హీరోయిన్ అయ్యాక తమిళ ఇండస్ట్రీలో పరుత్తివీరన్ అనే సినిమాకి నేషనల్ అవార్డు కూడా అందుకుంది ప్రియమణి. ప్రస్తుతం ఆరు భాషలలో హీరోయిన్గా నటిస్తూ 60కి పైగా సినిమాలలో నటించింది. అయితే ఈమె స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆర్గనైజేషన్ లో ప్రియమణికి ముస్తఫా పరిచయం కావడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడింది. ఇక అలా వీరిద్దరూ వివాహం చేసుకుందాం అనుకునే సమయానికి తమ కులమతాలు అడ్డంగా వచ్చాయట. వీరిద్దరూ మతాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి తమ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు తెలిపారట.అయితే అలాంటి ఎన్నో అడ్డంకులు దాటుకొని ముస్తఫా ప్రియమణి ఒకటయ్యారు. తాజాగా తన వివాహసమయంలో పడిన మాటలను గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్వతం అయింది హీరోయిన్ ప్రియమణి. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అడ్డంకులు వచ్చినా సరే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని చాలా ఆనందంగా ఉన్నామని ఎమోషనల్ గా తెలియజేసింది ప్రియమణి. అంతేకాకుండా తనకు 17 సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రులను ఒప్పించి సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని ఎమోషనల్ అయ్యింది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన తీరును చాలా హుందాగా చూపించారు. ఇదంతా ప్రియమని తను ఢీ షో లోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ గిఫ్ట్ రూపంలో ఈ వీడియోని ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version