ప్రముఖ నిర్మాత రవీందర్ అరెస్ట్ వెనుక అసలు కారణం ఇదేనా..?

-

తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు మహాలక్ష్మి, రవీందర్. బుల్లితెర నటి మహాలక్ష్మి నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్ ను గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నిర్మాత అయిన రవీందర్ ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక అసలు విషయంలోకెళితే భారీ పర్సనాలిటీతో భర్త పక్కనే బక్కపలచని పర్సనాలిటీతో మహాలక్ష్మి దంపతులను చూస్తే ఎవరైనా సరే కామెంట్ చేయక మానరు. అయితే అసలైన దాంపత్యం.. శారీరకంగా కాదు మానసికంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ జంట నిరూపించింది. ఇకపోతే రవీందర్ ప్రముఖ ఫైనాన్షియర్ కూడా..

తాజాగా రవీందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనికి గల కారణం ఏమిటంటే సాలిడ్ వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పాదన పేరుతో నకిలీ డాక్యుమెంట్ లను క్రియేట్ చేసి మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈయన తాను చెప్పినట్టు తన కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని అందర్నీ నమ్మించి దాదాపు రూ .16 కోట్ల వరకు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ విషయమై పోలీసులు రవీందర్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇకపోతే దీని వెనుక రవీందర్ మాత్రమే ఉన్నారా? లేక మరెవరైనా? ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇకపోతే ఏడాది కోలీవుడ్ నటి మహాలక్ష్మిని రవీందర్ పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈయన వార్తల్లో నిలుస్తున్నారు అని చెప్పాలి. రెండో పెళ్లితో ఇక సంతోషంగా ఉన్నామని మొదటి పెళ్లిలో ఒక కొడుకు పుట్టిన మహాలక్ష్మి ఆ తర్వాత నిర్మాత రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తినా ..ఆ తర్వాత ఆమె తన భర్తతో సంతోషంగా ఉన్నారని తెలిపి ఫోటోలు కూడా షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news