ఢిల్లీకి చేరుకున్న జోబైడెన్‌.. మోడీ స్పెషల్‌ ట్రీట్‌

-

జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ భారత్ కు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. బైడెన్ కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ఘన స్వాగతం పలికారు. తొలిసారిగా భారత్‌కు వచ్చిన బైడెన్‌కు ప్రధానికి అరుదైన గౌరవాన్ని ఇవ్వనున్నారు.

Biden "surprised" government records taken to his old office

ప్రధాని మోడీ నివాసంలో అమెరికా అధ్యక్షుడికి ప్రైవేట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రధాన మంత్రి మోడీ నివాసానికి బయలుదేరారు. ఇప్పటివరకు ప్రధానిగా ఏ దేశ అధ్యక్షుడికీ, ఏ దేశ ప్రధానికీ తన నివాసంలో ప్రధాని మోడీ విందు ఇవ్వలేదు. తొలిసారిగా జో బైడెన్‌కు ఆ గౌరవం లభించింది. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ ద్వైపాక్షిక చర్చలో కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోడీ కీలక చర్చలు జరపనున్నారు. భారత్‌లో జెట్ ఇంజిన్‌లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం లాంటి అంశాలపై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు మాత్రమే జో బైడెన్ భారతదేశానికి రావడంతో తదుపరి చర్చలు, కొన్ని ఒప్పందాలు వచ్చే జనవరిలో ఉండే అవకాశం ఉంది. జనవరి 26, లేదా ఒక రోజు ముందు ముఖ్య అతిధులుగా వచ్చే నాయకులతో “క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌”ను నిర్వహించాలని భారతదేశం ఆలోచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. “ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ” (iCET) కింద హై టెక్నాలజీ సహకారం పై ఇరు దేశాధినేతల సమీక్ష నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news