నేను చేస్తే తప్పు.. దీపిక చేస్తే తప్పు కాదా.. మల్లికా షరావత్..!!

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. అలా స్టార్డం సంపాదించిన తర్వాత బాలీవుడ్ లో ఉండే హీరోలనే ప్రేమించి వివాహం చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ మల్లికా షరావత్ ఎన్నో చిత్రాలలో నటించి బోల్డ్ హీరోయిన్ గా పేరు పొందింది. తాజాగా ఈమె నటించిన ఆర్కే చిత్రం త్వరలోనే విడుదల కానున్న సందర్భంలో తనకు సంబంధించి కొన్ని విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

మల్లికా షరావత్ మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ అయిన దీపిక పదుకొనే గెహ్రాయాన్ సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ఈమె చాలా బోల్డ్ గా నటించింది. ఇలాగే 15 సంవత్సరాల క్రితం నేను కూడా మర్డర్ సినిమాలో నటించాను. కానీ అప్పుడు జనాల ఆలోచన చాలా వేరేలా ఉండేది.. అప్పట్లో ఎక్కువగా ముద్దు సన్నివేశాలు బికినీ వేసుకున్న సన్నివేశాలు ప్రేక్షకుల సైతం తప్పు పట్టేవారు. దీంతో ఇండస్ట్రీలోని కొంతమంది సైతం తనని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టారని తెలియజేసింది. తనకి కేవలం అలాంటి సీన్లలో నటించడం తప్ప ఇంకేమీ రాదని కూడా తిట్టడం జరిగిందట.

కానీ ఈ విషయం ఎక్కడ చెప్పలేదని .. ఇన్ని రోజులకి తెలియజేసింది మల్లికా షరావత్. అయితే ఈమె ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ కూడా అంతగా ఎవరు పట్టించుకోలేదని తెలియజేసింది. అయితే దీపికా పదుకొనే చేసిన విధంగా తాను కూడా చేశానని , కానీ దీపిక పదుకొనే ని ఎవరు తప్పు పట్టలేదు .. నేను నటించాను కాబట్టే నన్ను ఇలా టార్గెట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారని తెలియజేసింది మల్లికా షరావత్. అయితే కానీ ఇప్పుడు ప్రేక్షకులు మనోభావాలు కూడా మారిపోయాయని తెలియజేసింది. ప్రస్తుతం మల్లికా షరావత్ నటించిన ఆర్కే చిత్రం ఈనెల 22న విడుదల కానుంది. ప్రస్తుతం తన కెరీర్ కి ఇది మలుపు తిప్పే చిత్రంగా భావిస్తున్నానని తెలియజేసింది మల్లికా షరావత్.