పవన్-లోకేష్ ఎమ్మెల్యేలు అవ్వలేరా? రోజా సవాల్ విసిరినట్లు వారు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవలేరా? అంటే రోజా దృష్టిలో గెలవలేరనే చెప్పుకోవాలి. పదే పదే రోజా…పవన్, లోకేష్‌లని ఉద్దేశించి ఎమ్మెల్యేలు కూడా అవ్వలేరని వెటకారం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిసారి వారిపై విమర్శలు చేయాలంటే ముందు ఎమ్మెల్యేలుగా గెలవాలని సవాల్ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా రోజా అదే మాదిరిగా సవాల్ చేశారు.
ముందు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవాలని అన్నారు. ఇక పవన్ ఏమో హలో ఏపీ…బై బై వైసీపీ అంటుంటే…రోజా ఏమో హాయ్ ఏపీ..బై బై బీపీ అంటున్నారు..బీపీ అంటే బాబు, పవన్ అంటా. ఇంకా అలా ఆమె వెటకారం, ఎగతాళి చేస్తూ ముందుకెళుతున్నారు. అయితే ఇదంతా రోజా, వైసీపీ వర్షన్ మరి నిజంగానే ఈ సారి పవన్, లోకేష్ గెలవలేరా? అంటే నో డౌట్ ఈ సారి వారిద్దరు గెలిచి ఎమ్మెల్యేలు అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఇద్దరు ఓటమి పాలయ్యారు.
పవన్..భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఎత్తులు, ఓట్ల చీలిక వల్ల పవన్‌కు ఓటమి వచ్చింది. ఈ సారి పవన్ కేవలం ఒకే సీటులోనే పోటీ చేస్తున్నారు. అది కూడా ఓడిన భీమవరంలో…అక్కడ పోటీ చేస్తే పొత్తులతో సంబంధం లేకుండా పవన్ గెలవడం ఖాయమని అంటున్నారు. టిడిపితో పొత్తు ఉంటే పవన్‌కు భారీ మెజారిటీ ఖాయం.
ఇక లోకేష్ మంగళగిరి బరిలో ఓడిపోయారు. మళ్ళీ అక్కడే పోటీ చేయడానికి లోకేష్ రెడీ అయ్యారు. ఓడిన మంగళగిరి ప్రజలకు అండగా నిలబడ్డారు. సొంత నిధులు ఖర్చు పెట్టి పనులు చేశారు. దీంతో అక్కడ లోకేష్‌కు మద్ధతు పెరిగింది. పొత్తు లేకపోయిన ఈ సారి లోకేష్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. జనసేనతో పొత్తు ఉంటే మంచి మెజారిటీ వస్తుంది. కాబట్టి పవన్-లోకేష్ గెలిచి ఎమ్మెల్యేలు అవుతారు..కానీ ఈ సారి నగరిలో రోజా గెలుపే డౌట్ అంటున్నారు.