వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన జ‌గ‌ప‌తిబాబు

హీరో గా తెలుగు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుని విభిన్న పాత్ర ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న జ‌గ‌ప‌తి బాబు వెబ్ సిరీస్ ల బాట ప‌ట్టారు. తాజా గా జ‌గ‌ప‌తి బాబు ఒక వెబ్ సిరీస్ కు ఓకే చెప్పేశాడు. ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కె ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో ప్ర‌సారం కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ కు పరంప‌ర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అలాగే ఆర్కా మీడియా ప‌తాకం పై శోభు యార్ల గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.

కాగ వీరు గ‌తంలో బాహుబ‌లి వంటి భారీ సినిమా కు ప్రోడ్య‌స‌ర్లు గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అలాగే ఈ ప‌రంప‌ర వెబ్ సిరీస్ కు కృష్ణ విజ‌య్ ఎల్ – విశ్వ‌నాథ్ అరిగెలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ వెబ్ సిరీస్ లో శ‌ర‌త్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు వ‌రుస గా నాగేంద్ర నాయుడు, మోహ‌న్ రావు అనే పాత్ర ల‌లో క‌నిపించ‌నున్నారు. అయితే ఇద్ద‌రు దిగ్గ‌జ న‌టులు ముఖ్య పాత్ర‌ల‌లో చేస్తున్న ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.