ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టిన ఆర్మీ…!

ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. జమ్మూ కాశ్మీర్ కుల్గాం లో తెల్లవారు ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. కుల్గామ్ లో ఉగ్రవాదుల కదలికలపై జవాన్లకు సమాచారం అందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు పోలీసులతో కలిసి నిర్భంద తనికీలు ప్రారంభించారు. ఈ క్రమంలో జవాన్లకు ఇద్దరు ఉగ్రవాదులు కంటపడ్డారు.

జవాన్ల ను చూడగానే కాల్పులు జరిపారు. దాంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో అక్కడిక్కడే జవాన్ల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆ ప్రాంతంలో మరికొంత మండి ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. దాంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.