మహేష్ కోసం రెండు స్క్రిప్ట్ లను సిద్ధం చేసిన జక్కన్న..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే తదుపరి చిత్రం రాజమౌళి.. మహేష్ బాబుతో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ముందు నుంచి ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి .. మహేష్ బాబు కోసం రెండు స్క్రిప్ట్ లను తయారు చేశారట. చివరిదశ చర్చల కోసం వెయిట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మహేష్ బాబు ఇటీవలే విదేశాలకు వెళ్లి అక్కడ సమయాన్ని గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక మహేష్ బాబు తిరిగి వచ్చిన వెంటనే రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో తుది నిర్ణయానికి వచ్చేసి..వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెడతామని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే రాజమౌళి టీం మహేష్ బాబు సినిమా కోసం లొకేషన్ల వేట ప్రారంభించారని తెలుస్తోంది. ఇక త్వరలోనే కథ విషయంలో మహేష్ బాబు అలాగే రాజమౌళి తుది నిర్ణయానికి రాబోతున్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబు తుది నిర్ణయం తీసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే షూటింగ్ పనులు మొదలు పెట్టేలా ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం.

మహేష్ బాబు వచ్చే నెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ని మొదలు పెట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఏడాది చివరిలో త్రివిక్రమ్ సినిమా పూర్తవుతుంది. ఇక ఇదే ఏడాది జక్కన్న సినిమా కూడా మొదలు కాబోతోంది. జక్కన్న సినిమా అంటే మినిమమ్ రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి 2024 లో ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న.