చోటే మియాతో జాన్వి కపూర్?

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వికపూర్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ భామ ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది.

ఇది ఇలా ఉండగా, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘బడే మియా చోటే మియా’. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. టైగర్ సరసన జాన్వి నటించనుంది. ఆ పాత్ర కోసం జాన్వినే దర్శకుడు అబ్బాస్ కోరుకుంటున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో అక్షయ్ కుమార్ కు జోడి ఎవరు ఉండరట. వచ్చే నెల లండన్ లో జరగనున్న షెడ్యూల్ లో జాన్వి పాల్గొనబోతున్నట్లు సమాచారం.