ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దినేష్ ఆరోరా ఇల్లు, ఆఫీసుతోపాటు అతని స్నేహితుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. దినేష్ అరోరాకు చెందిన అకౌంట్లో రూ. కోటి నగదు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రాధాకృష్ణ ఇండస్ట్రీ ద్వారా దినేష్ అరోరా యూకో బ్యాంక్ లోకి నగదు బదులు అయినట్లు గుర్తించారు.
సమీర్ మహేంద్రు అనే వ్యక్తి ఆ నగదును బదిలీ చేసినట్లు తేలింది. ఇప్పటికే దినేష్ అరోరా పై సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దినేష్ ఆరోరా డబ్బులు మనీష్ సిసోడియాకు ఇచ్చినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. సమీర్ మహీంద్రు, అర్జున్ పాండే, విజయ్ నాయర్, రామచంద్ర పిల్లేయ్ రూ. 5 కోట్లు బదిలీ చేసినట్లు గుర్తించింది ఈడీ. ఈడి కస్టడీ లో ఉన్న సమీర్ మహేంద్ర స్టేట్మెంట్తో ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాదులో రెండు చోట్ల సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు.