యాంకర్ ప్రదీప్ తో పెళ్లిపై జ్ఞానేశ్వరి కామెంట్స్..!

-

తెలుగు బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రదీప్ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ప్రదీప్ పెళ్లిని క్యాష్ చేసుకోవాలని అనుకున్న స్టార్ మా ప్రదీప్ తో పెళ్లిచూపులు అనే కాన్సెప్ట్ తో ఓ రియాలిటీ షో చేశారు. ఆ షోలో విన్నర్ గా నిలిచిన జ్ఞానేశ్వరిని ప్రదీప్ పెళ్లాడుతాడా లేదా అని కొన్నాళ్లు హడావిడి చేశారు.

లేటెస్ట్ గా జ్ఞానేశ్వరి మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. ప్రదీప్ తోనే కాదు తాను ఇప్పుడప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని.. ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న తను ఓ కన్నడ సినిమా చేశానని చెబుతుంది. తెలుగులో మిస్టర్ అండ్ మిస్ సినిమాలో హీరోయిన్ గా చేసిన జ్ఞానేశ్వరి పెళ్లిచూపులు షో జనాధరణ పొందలేదని అందుకే ఆ షోని మధ్యలో ఆపేయాల్సి వచ్చిందని అన్నది. ప్రేక్షకులకు ఆ షో నచ్చలేదని ప్రదీప్ షో మీద సెటైర్స్ వేసింది జ్ఞానేశ్వరి.

యాంకర్ సుమ కూడా ఆ షో వ్యాఖ్యాతగా ఉన్నారు. సుమ ఏ చేసినా అది పెద్ద హిట్ అవుతుంది కాని ప్రదీప్ తో కలిసి చేసిన పెళ్లిచూపులు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే మధ్యలోనే ఆపేసి జ్ఞానేశ్వరికి టైటిల్ ఇచ్చేశారు. ప్రదీప్ తో పెళ్లి మాట అటుంచితే జ్ఞానేశ్వరికి తెలుగులో మంచి అవకాశాలే వస్తున్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version