టీడీపీలో కొందరి వల్ల తాను అవమానాలు ఎదుర్కొంటున్నానని శంకర్ రెడ్డి తెలిపారు. అందుకే పార్టీని వీడాల్సి వస్తుందని అన్నారు. పార్టీని వీడుతున్నందుకు తనకు బాధగా ఉందని తెలిపారు.
ఏపీలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ టీడీపీకి వలసల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు ప్రముఖ నేతలు ప్రతిపక్ష పార్టీ వైకాపాలో చేరారు. అయితే ఈ వలసలు ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీకి చెందిన మరో కీలక నేత వైకాపాలో చేరవచ్చని తెలిసింది. త్వరలోనే ఆయన జగన్ సమక్షంలో వైకాపా కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.
తిరుపతి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కందాటి శంకర్ రెడ్డి త్వరలో టీడీపీని వీడనున్నారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఎంతో కాలంగా ఆయన టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీతో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. అలాంటి నేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైకాపాలో చేరుతారనే వార్త అటు టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. కాగా ఈ విషయంపై శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను టీడీపీని వీడుతున్నాననే మాట నిజమేనని అన్నారు. పార్టీని వీడుతున్నందుకు తనకు బాధగా ఉందని తెలిపారు.
టీడీపీలో కొందరి వల్ల తాను అవమానాలు ఎదుర్కొంటున్నానని శంకర్ రెడ్డి తెలిపారు. అందుకే పార్టీని వీడాల్సి వస్తుందని అన్నారు. ఈ క్రమంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకీ మరింత దయనీయంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా పార్టీ నుంచి కీలక నేతలంతా వెళ్లిపోతుండడంతో ఇప్పుడు సీఎం చంద్రబాబుకు దిక్కు తోచడం లేదని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో ముందు ముందు టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.