యంగ్ టైగర్ టు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’.. ట్యాగ్ మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర గ్లింప్స్ రిలీజ్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ లో ఓ కీలక అప్డేట్ కనిపించింది. ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్​ ఈ సినిమాతో తన యంగ్ టైగర్​ ట్యాగ్​ లైన్​ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్ర గ్లింప్స్ వీడియోలో తారక్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ గ్లింప్స్​లో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాగ్​ లైన్ మారడం. ఇన్నాళ్లూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ ఉన్న విషయం తెలిసిందే, కానీ ఇప్పుడు ఈ గ్లింప్స్ లో మ్యాన్​ ఆఫ్ మాసెస్​గా ఎన్టీఆర్ ట్యాగ్ లైన్ పడింది. ఇప్పటివరకు మ్యాన్​ ఆఫ్ మాసెస్​గా ఎన్టీఆర్​ను కేవలం పిలిచేవారు. కానీ ఈ సారి అఫీషియల్​గా స్క్రీన్​పై వేయడం విశేషం. ఈ పవర్ ఫుల్ ట్యాగ్ అభిమానులకు బాగా నచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news