TarakaRatna : బెంగళూరులోని ఆస్పత్రి చేరుకున్న ఎన్టీఆర్..వీడియో వైరల్

నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా .. అప్పటికే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

మెరుగైన చికిత్స కోసం పదిమంది వైద్య బృందంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత అక్కడ విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇక నందమూరి వారసుడు తారకరత్న ను చూసేందుకు బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ చేరుకున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి వారు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?