కంగ్రాట్స్ బావా… అంటూ బ‌న్నీకి ఎన్టీఆర్ ట్విట్‌..

-

అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వ‌చ్చిన తాజాగా చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక త్రివిక్రమ్, బ‌న్నీ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. అనుకున్న‌ట్టుగానే ఈ సినిమాపై హిట్ టాక్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ అల… వైకుంఠపురములో చిత్రంపై తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తిరుగులేని పెర్ఫార్మెన్స్ కనబర్చాడని కితాబిచ్చారు.

ఎంతో సునాయాసంగా హిట్ కొట్టాడని అభినందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. `కంగ్రాట్స్ బావా… అల… వైకుంఠపురములో చిత్రం అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాటలు రాశారు… కంగ్రాట్స్ స్వామీ` అంటూ ట్వీట్ చేశారు. `మురళీశర్మ గారి నటనకు హ్యాట్సాఫ్. క్యారెక్టర్ రోల్ ను పండించారు. తమన్ ఇచ్చిన సంగీతం అమోఘం. ఈ సినిమాకు ప్రధానబలం సంగీతమే. పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు అంటూ తారక్ ట్వ‌ట్ట‌ర్ వేదిక‌గా తన అభిప్రాయాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news