జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఢిల్లీకి వెళ్లారు. అంతే! తెలుగు మీడియాలో ఒక్కటే వైరల్.. ఇ క, ఏపీలో భూకంపం ఖాయం.. రాజధాని విషయంలో జగన్ తీవ్ర పరిస్థితి ఎదుర్కోవడం ఖాయం.. అంటూ ఓ వర్గం మీడియా భారీ ఎత్తున కథనాలు ప్రచారం చేస్తోంది. దీంతో పవన్ పర్యటనకు ఒక్కసారిగా బూ మ్ వ చ్చింది. గతంలోనూ పవన్ అనేక సందర్భాల్లో ఢిల్లీ పర్యటన చేశారు. జగన్ ప్రభుత్వం రాకముందు కూడా ఆయన ఢిల్లీలో పర్యటించారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ సానుకూలతలను డప్పు వేసేందుకు ఆయన ప్రయత్నించారనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఇక, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన పవన్.. రివర్స్ టెండర్లు, పో లవరం, ఇసుక కొరత వంటివాటిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే , వాటిపై కేంద్రం ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. ఇక ఇప్పుడు కీలకమైన రాజధాని రగడ సాగుతున్న క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటనపై ఓ వర్గం మీడియా విపరీత ప్రచారం చేస్తోంది.
రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, చూస్తూ ఊరుకోదని, పవన్ కూడా బీజేపీ పాటే పాడిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం నుంచి కేంద్రం దూరంగా ఉండాలని చూస్తోంది.
ఈ క్రమంలో జగన్ ఎవరిమాటనూ వినే పరిస్థితి లేక పోవడంతో పవన్ను ఓ ప్రముఖ పార్టీ నాయకుడు తన దూతగానే కేంద్రం వద్దకు పంపారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేసి తాము నష్టపోయామని జగన్ బలపడ్డాడని పదే పదే చెబుతున్న పవన్.. ఇప్పుడు బీజేపీ, టీడీపీలతో పొత్తు కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే, నిన్న మొన్నటి ఎన్నికల్లో తిట్టుకుని ఇప్పుడు అనూహ్యంగా కలిసిపోతే.. ఎలా అనుకుంటున్న పవన్ దానికి ప్రాతిపదిక, వేదిక వెతుక్కుంటున్నారు. దీనిలో భాగంగానే రాజధాని అంశాన్ని అడ్డు పెట్టుకుని కేంద్రం వద్దకు వెళ్లారని అంటున్నారు. అయితే కేంద్రం ఏమీ ఈ విషయంలో స్పందించే అవకాశం లేదని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.