2021 వేసవిలో జురాసిక్ వరల్డ్ సిరీస్‌లోని మూడవ చిత్రంగా ‘డొమినియన్’ రాబోతోంది.
28 సంవత్సరాల క్రితం విడుదలైన ‘జురాసిక్ పార్క్’ ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. పుస్తకాల్లో చరువుకున్న డైనోసార్లు తెరమీద ప్రత్యక్షం కావడంతో ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. విపరీతమైన ప్రేక్షకాదరణతో ‘జురాసిక్ పార్క్’, బాక్సాఫీస్ దుమ్ము దులిపి కాసుల వర్షం కురిపించిది. 6600 కోట్ల రూపాయల కలెక్షన్లతో బీభత్సం సృష్టించింది. ఆస్కార్ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులను గొలుచుకుందీ చిత్రం. ఆ తర్వాత దానికి సీక్వెల్స్‌గా ‘ది లాస్ట్ వరల్డ్-జురాసిక్ పార్క్ (1997), ‘జురాసిక్ పార్క్-3 (2001’ దిడుదల కాగా, ఆ తర్వాత ప్రారంభమైన సీక్వెల్లకు జురాసిక్ వరల్డ్ అని వ్యవహరించడం స్టార్టయింది.
దర్శక మాంత్రికుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘జురాసిక్ పార్క్’ సృష్టికర్త. దాని తర్వాత ‘జురాసిక్ వరల్డ్’ సిరీస్ మొదలైంది. 2015లో మొదటి చిత్రం రాగా, 2018లో జురాసిక్ వరల్డ్-ఫాలెన్ కింగ్‌డమ్’ రిలీజయింది. ఈ రెండో భాగానికి జె.ఎ. బయోనా దర్శకుడు.
ఇప్పుడు ముచ్చటగా మూడోది షూటింగ్ మొదలుపెట్టుకుంది. మొదటి జురాసిక్ వరల్డ్ దర్శకుడు కొలిన్ ట్రెవొరొ, ఈ మూడో చిత్రానికి దర్శకత్వం చేపట్టనున్నాడు. రెండో భాగం ఎక్కడైతే ముగిసిందో, సరిగ్గా అక్కన్నుండే ‘డొమినియన్’ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని, టైటిల్‌ను ట్రెవొరొ అధికారికంగా ట్విటర్ ద్వారా ధృవీకరించారు. క్లాప్‌బోర్డ్ మీద టైటిల్ ఉన్న ఫోటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేయడం ద్వారా చిత్రం పేరును ప్రకటించారు.
‘ఫాలెన్ కింగ్‌డమ్’లో నటించిన క్రిస్ ప్రాట్, బ్రైస్ డాలస్ హోవర్డ్ తిరిగి అవే పాత్రలను పోషించనుండగా, 1993 మొదటి ‘జురాసిక్ పార్క్’లో నటించిన సూపర్‌స్టార్స్ జెఫ్ గోల్డ్‌బ్లమ్, సామ్ నీల్, లారా డెర్న్ తిరిగి జురాసిక్ ప్రపంచంలోకి ప్రవేశించనున్నారు. 2021 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా పలుభాషల్లో ‘జురాసిక్ వరల్డ్ – డొమినియన్’ విడుదల కానుంది.