నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తినన్నూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. జీవితాన్ని చెప్పే కథ.. కథనాలతో రెండో సినిమానే అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతం. ఇక ఈ సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమాతో మరోసారి నాని నాచురల్ స్టార్ అనిపించుకున్నాడని అంటున్నారు. అయితే ఒకవేళ నాని ఈ కథ రాంగ్ టైంలో విని నో అని చెప్పుంటే.. ఒకవేళ డేట్స్ అడ్జెస్ట్ కాక సినిమా చేసే అవకాశం లేకుంటే ఈ కథకు ఎవరు పర్ఫెక్ట్ అంటే మాస్ మహరాజ్ రవితేజ అని అంటున్నారు.
అదేంటి ఆయనేమో మాస్ మహరాజ్ ఈ కథలో అర్జున్ పాత్రకు సూట్ అవుతాడా అంటే.. రవితేజలో మాస్ అంశాలు ఎలా ఉంటాయో సగటు మనిషిగా నేచురల్ యాక్టర్ కూడా ఉన్నాడు. నాని కాకుండా జెర్సీ సినిమాలో రవితేజ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈమధ్య రొటీన్ సినిమాలతో కాస్త వెనుకపడ్డ రవితేజ ఇలాంటి కథలు చేస్తే బెటర్. లాస్ట్ ఇయర్ అమర్ అక్బర్ ఆంటొని అంటూ ఫెయిల్యూర్ అటెంప్ట్ చేసిన రవితేజ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ తో తెరి రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఎంత చెప్పినా ఏం చెప్పినా జెర్సీ సినిమాలో మరో హీరోని ఊహించుకోలేం అన్నట్టుగా నాని నటన ఉంది. నాని కెరియర్ లో ది బెస్ట్ అంటే జెర్సీలో అర్జున్ పాత్ర అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం నాని ఎంత కష్టపడ్డాడో అంతకు రెట్టింపు ప్రశంసలు అందుకుంటున్నాడు. మళ్లీ రావా సినిమాతో ప్రతిభ చాటిన దర్శకుడు గౌతం తిన్ననూరి జెర్సీతో స్టార్ లీగ్ లోకి వచ్చాడు.