యువ కథానాయకుడికి జోడీగా కాజల్ అగర్వాల్

-

కాజల్ అగర్వాల్ వరుస విజయాలు సాధిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. ప్రస్తుతం కాజల్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగుతో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె కమల్ సరసన కనిపించనుంది. ఆ తరువాత ఆమె ఓ యువ కథానాయకుడి జోడీగా కనిపించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు .. శ్రీవిష్ణు. అవును.. శ్రీవిష్ణు హీరోగా లక్ష్య ప్రొడక్షన్స్ వారు ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రదీప్ వర్మ పరిచయం కానున్నాడు.

పోలీస్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కాజల్ ను సంప్రదిస్తున్నారు. కాజల్ అంగీకరిస్తే అది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుందని భావిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోల జోడీగా కనిపించడానికి సైతం ఆసక్తిని చూపిన కాజల్, శ్రీవిష్ణు జోడీగా అలరించడానికి అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news