పాస్ చెల్లదని… బాలికను బస్ లో నుంచి తోసేసిన కండక్టర్

-

పాస్ చెల్లదని ఒక కండక్టర్ విద్యార్థినిని బస్ లో నుంచి తోసేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఈ నెల 11న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కేఏ 42ఎఫ్ 2217 నంబరు గల ఆర్టీసీ బస్ లో కనకపుర టౌనుకు చెందిన 16 ఏళ్ల భూమిక ఎక్కింది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. బస్ ఎక్కిన సమయంలో టికెట్ తీసుకోవాలని కండక్టర్ ఆమెను అడిగాడు… అయితే విద్యార్థిని అని చెప్పి… తనకు పాస్ ఉందని, పాస్ తీసుకున్నాను అని చూపించింది… ఎందుకో ఏమో గాని…

ఆ కండక్టర్ అలాంటిది ఈ బస్ లో చెల్లదు బస్ దిగు అంటూ ఆమెను బెదిరించాడు. సరే తర్వాతి స్టాప్ లో తాను దిగుతానని భూమిక చెప్పగా కాదు కూడదు అంటూ ఆమెను బస్ లో నుంచి తోసేసాడు. వెళ్లే వెళ్లే బస్ లో నుంచి పడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది… దీనిని గమనించిన స్థానికులు ఆ బాలికను వెంటనే దగ్గరలో ఉన్న ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఆమె కాలితో పాటు, పళ్ళు కూడా విరిగిపోయాయని వైద్యులు మీడియాకు తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ప్రమాదానికి కారణం హారోహళ్లి డిపోకి చెందిన కండక్టర్‌ శివశంకర్ గా పోలీసులు గుర్తించి అతనిపై హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక అక్కడి ఆర్టీసీ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. దూరప్రాంతాల్లో చదువుకొనే విద్యార్థుల కోసం కర్ణాటక ప్రభుత్వం బస్ పాస్‌లు అందిస్తుందని… అయినా సరే కండక్టర్లు ఒప్పుకోవడం లేదని, టికెట్ తీసుకోమని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కమీషన్ల కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news