పెళ్లికి రెడీ అవుతోన్న టాలీవుడ్ ముదురు హీరోయిన్‌..!

-

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో 2005వ సంవత్సరంలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఇక హీరోయిన్‌గా ద‌శాబ్దంన్న‌ర కాలంగా హీరోయిన్‌గా ఉన్న ఆమె ఇప్పుడు మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువైంది. కాజ‌ల్ వ‌య‌స్సు పైబ‌డ‌డంతో ఇప్ప‌ట‌కీ అవ‌కాశాలు త‌గ్గినా ఆమె మాత్రం అటు బెల్లంకొండ లాంటి కుర్ర హీరోల‌తో పాటు మెగాస్టార్ సినిమాల్లోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ ఇండియ‌న్ 2 సినిమాలో న‌టిస్తోన్న కాజ‌ల్ మెగాస్టార్ – కొర‌టాల సినిమాలో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ రెండు సినిమాల త‌ర్వాత ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల‌ని డిసైడ్ అయ్యింద‌ట‌. ఏ హీరోయిన్ కైనా ఒక ఏజ్ వరకే ఆఫర్లు వస్తాయి. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా రావు. ఇక ఇప్పుడు కాజ‌ల్‌కు క‌మ‌ల్‌, చిరు లాంటి సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న మాత్ర‌మే ఒక‌టి ఆరా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఈ సినిమాల త‌ర్వాత ఆమెకు ఇంక అవ‌కాశాలు రావ‌డం క‌ష్టంగానే ఉంది.

ఇప్ప‌టికే కాజ‌ల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని ఓ కొడుకును కూడా కంది. చెల్లి కొడుకుతో ఆడుకుంటోన్న కాజ‌ల్ సంసార జీవితంలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇక కాజ‌ల్ కొద్ది రోజులుగా ఓ బిజినెస్‌మెన్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చినా వాటిన ఆమె ఖండించింది. ఇక ఇంట్లో వాళ్లు కూడా వ‌చ్చే యేడాది ఆమెకు పెళ్లి చేసేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఏదేమైనా కాజ‌ల్ ప్ర‌స్తుతం చేస్తోన్న ఇండియ‌న్ 2, చిరు సినిమాయే ఆమె చివ‌రి అంకంలో చేసే పెద్ద సినిమాలు అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version