ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు అంతటా అలానే.. హీరోయిన్ కామెంట్స్

-

మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు భారత సినీ పరిశ్రమను ఏ విధంగా కుదిపాయో అందరికీ తెలిసిందే. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం క్రమంగా బాలీవుడ్‌కు పాకింది. మెల్లిగా సౌత్‌లో పాగా వేసింది. టాలీవుడ్‌లో శ్రీ రెడ్డి సృష్టించిన ప్రకంపనలు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడి సంగతి ఎలా ఉన్నా.. బాలీవుడ్‌లో తనూ శ్రీ దత్తా చేసిన ఆరోపణలు మాత్రం బాలీవుడ్‌ను షేక్ చేసింది.

నానా పటేకర్ వంటి విలక్షణ నటుడు, సీనియర్ నటుడిపైనే సంచలన కామెంట్స్ చేసింది. దీంతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది. అయితే ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు వేయడం, అది కోర్టుల చుట్టూ తిరగడం, సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అంతా సద్దుమణిగిపోయింది. అయితే వీటిపై కాజోల్ స్పందించింది. తాను నటించిన దేవీ అనే ష్టార్ట్ ఫిలిమ్ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. స్త్రీ వివక్ష, భద్రత వంటి అంశాలపై మాట్లాడింది.

సినీ పరిశ్రమలో ప్రస్తుతం మహిళలకు భద్రత ఉందని, గతంతో పోల్చుకుంటే.. ప్రొడక్షన్ కంపెనీలు పని ప్రదేశాల్లో మహిళా నటులు, సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చింది. పనిచేసే ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. షూటింగ్ జరిగే ప్రదేశాలేమీ పెద్దవేమీ కాదని, ఏం జరుగుతుందో ప్రతీ ఒక్కరికి తెలుస్తుందని పేర్కొంది. ఒకరినొకరు గౌరవించుకునే విధంగా మెలగాలని తెలిపింది. లింగ వివక్షత అనేది కేవలం సినీ పరిశ్రమలోనే కాదు.. ప్రపంచం మొత్తం అలాంటి ప్రమాదకర పరిస్థితిలోనే ఉందని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news