జగన్ చేసిన అతి పెద్ద తప్పు, ఇప్పుడెలా…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆ రాష్ట్ర మాజీ సిఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు తగ్గించడంపై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ కి పలు సూచనలు చేసారు. 1987 లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని చంద్రబాబు నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. హైకోర్ట్ ఆర్డర్ ప్రకారం జగన్ బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ తగ్గించడం అన్యాయమని అన్నారు.

ఇటీవల హైకోర్ట్ తన తీర్పులో జగన్ స్థానిక సంస్థల కోసం ఇచ్చిన 59 శాత౦ రిజర్వేషన్ ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ జగన్ సర్కార్ మాత్రం హైకోర్ట్ తీర్పు పై సవాల్ చేయలేదు. దీనిపై ఇప్పుడు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు లేఖ రాస్తూ… 1995 నుంచి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ లు అమలు చేస్తున్నామని, 26 ఏళ్ళుగా బీసీలకు అదే అమలు జరుగుతుందని అన్నారు.

ఇప్పుడు 24 శాతం తో బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చంద్రబాబు ఆరోపించారు. రిజర్వేషన్ పై సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చెయ్యాలని చంద్రబాబు సూచించారు. 2019 లో బీసీ డిక్లరేషన్ తో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇలా చేయడం అన్యాయమని అన్నారు. హైకోర్ట్ తీర్పు పై సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయకుండా ఇప్పుడు 24 శాతం అనడం దారుణం అన్నారు.

అయితే ఇప్పుడు దీనిపై బీసీలు జగన్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ. కాని జగన్ మాత్రం ఇక్కడ అనవసర తప్పిదం చేస్తూ వాళ్ళను దూరం చేసుకుంటున్నారు అంటున్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని ఇప్పుడు జగన్ మార్చడంపై అటు వైసీపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news