రేపే ‘కల్కి’ ట్రైలర్‌.. కల్కి నుంచి దీపికా ప‌దుకొనే కొత్త‌ లుక్

-

ఈనెలలో థియేటర్‌లోకి వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల‌లో ‘కల్కి 2898 AD’ ఒక‌టి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా ప‌దుకొనే, దిశా పఠానీ, కమల్ హాసన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మ‌హాన‌టి ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

జూన్‌ 27న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌భాస్ అభిమానులు ట్రైల‌ర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. ఈ క్రమంలోనే ట్రైల‌ర్ రేపు విడుద‌ల కానున్న‌ట్లు తాజాగా మరో అప్‌డేట్‌ ఇస్తూ పనిలో పనిగా దీపికా ప‌దుకొనే కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news