ప్రభాస్ కాలికి గాయం ఇంకా తగ్గలేదా?.. ఆందోళనలో ఫ్యాన్స్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత కొంతకాలంగా అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన కాలికి సర్జరీ కూడా చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇంకా ఆ గాయం మానలేదని సమాచారం. రీసెంట్గా ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో స్టేజ్పై నిల్చున్న ప్రభాస్ ఒక్క సెకన్ పాటు కాస్త వెనక్కి తుళ్లిపడినట్లు కనిపించింది.ఆ వీడియో చూసిన వారంతా ప్రభాస్ కాలికి నొప్పి ఇంకా తగ్గలేదని, ముఖంలోనూ నొప్పి బాధ కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. బాహుబలి చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్ కాలికి గాయమైందని, ఆ తర్వాత సాహో, సలార్ షూటింగ్ సమయంలో కూడా కాలికి గాయమైందని ప్రచారం సాగింది. సలార్ షూటింగ్ సమయంలో స్పెయిన్‌లో ఆయన కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారని వార్తలొచ్చాయి. అది ఇంకా మానలేదని ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news