BREAKING: రాజన్న సిరిసిల్ల జిల్లా మరో దారుణం జరిగింది. అప్పుల భాదతో మరో నేత కార్మికుడి ఆత్మహత్య జరిగింది. తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో ముదిగొండ నరేష్(35) నేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతోనే… ముదిగొండ నరేష్(35) నేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సిరిసిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వక పోవడంతో.. నేతన్నలకు ఉపాధి దొరకడం లేదు. దీంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రెండు రోజుల కిందట సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11 వార్డు రాజీవ్ నగర్ కు కు చెందిన కుడిక్యాల నాగరాజు (47) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బాత్రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుడిక్యాల నాగరాజు (47) అనే వ్యక్తి మరణించారు. మరమగాలు (పవర్లూమ్) నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న నాగరాజు గత ఆరు నెలలనుండి ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.