Kalki Movie : భైరవ్​ ఆంథమ్ ఫుల్ సాంగ్​ వచ్చేసిందోచ్​

-

కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్​ దగ్గర పడేకొద్ది హైప్​ పెరుగుతూ వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ తర్వాత ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో భైరవ ఆంథమ్ పేరుతో రెండు రోజుల క్రితం(జూన్​ 15వ తేదీన) మేకర్స్ ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్​ను రిలీజ్ చేశారు.

పంజాబీ స్టైల్​లో సాగే ఈ పాట హూషారెత్తిస్తోంది. ఇందులో పంజాబీ లిరిక్స్ ఉన్నాయి. ఈ సాంగ్​ను పంజాబీ స్టార్ సింగర్ దిల్‍జీత్ దోసంజ్ పాడారు. పాడటంతో పాటు ఈ పాట వీడియోలో ప్రభాస్​తో కలిసి దిల్జీత్ స్టెప్పులేశారు. సాంగ్​ మంచి బీట్‍తో ఆకట్టుకుంది. సంతోష్ నారాయణ్ ఈ పాటకు మంచి ట్రెండీ ఫాస్ట్ బీట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఇక ఈ సాంగ్ చివరలో ప్రభాస్ కూడా దిల్జీత్​తో కలిసి పంజాబీ సర్దార్ వేషధారణలో కనిపించి సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news