పోలవరం ప్రాజెక్ట్ నదిని మళ్లించి కడుతున్న ప్రాజెక్ట్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2020లో వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల దెబ్బ తిన్నదని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోబాలను ఎదుర్కొంది. నా మనసు అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది.
ఇప్పటికే నేను ఈ ప్రాజెక్ట్ ను 30 సార్లకు పైగా వచ్చి పరిశీలించాను. 72 శాతం ప్రాజెక్ట్ ను నా హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా వాల్ కట్టాల్సిఉంది. పోలవరం ప్రాజెక్ట్ తో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలు నీటిని వాడుకోవచ్చు అని తెలిపారు. ప్రాజెక్ట్ కి సంబంధించి ఏజెన్సీ తో పాటు సిబ్బందిని కూడా మార్చేశారు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని తెలిపారు సీఎం చంద్రబాబు.