118 టీజర్.. కళ్యాణ్ రామ్ కొత్త ప్రయోగం..!

-

ఇన్నాళ్లు సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న కెవి గుహన్ మొదటిసారి మెగా ఫోన్ పట్టుకుని చేస్తున్న సినిమా 118. నందమూరి కళ్యాణ్ రాం హీరోగా వస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రాం సరసన షాలిని పాండే, నివేదా థామస్ నటిస్తున్న 118 మూవీ టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.. లవర్ తో హ్యాపీగా జీవితాన్ని గడిపుతున్న హీరోకి తన గత తాలూఖా జ్ఞాపకాలు తనని ఎక్కడికో తీసుకెళ్తుంటాయి. ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలతో 118 టీజర్ వచ్చింది. కచ్చితంగా ఈసారి నందమూరి ఫ్యాన్స్ కు నచ్చేలా కళ్యాణ్ రాం ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. పటాస్ తర్వాత మళ్లీ హిట్ రేసులో వెనుకపడిన కళ్యాణ్ రాం 118తో పక్కా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

2019 ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటుగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు కళ్యాణ్ రాం.

Read more RELATED
Recommended to you

Latest news